పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి..
జగిత్యాల: పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాలలో రూ.235 కోట్లతో 450 పడకల ఆస్పత్రికి మంత్రి లక్ష్మణ్‌కుమార్ మంగళవారం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో పరిశీలించారు. రూ.23.5 కోట్లతో క్రిటికెల్ కేర్, రూ.3 కోట్లతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నిర్మించారు. డయాలసిస్, ఆపరేషన్ థియేటర్లు, ప్రసూతి శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చాయన్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సునీల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, ఈఈ విశ్వప్రసాద్, డీఈ రాజిరెడ్డి, ఆర్‌ఎంవోలు శ్రీపత్, నరేశ్, గీతిక, స్వరూప, సందీప్ రావు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ
జగిత్యాలరూరల్: బీర్‌పూర్ మండలకేంద్రంలోని రైతువేదికలో అదే మండలానికి చెందిన 30 మందికి కల్యాణలక్ష్మీ కింద మంజూరైన రూ.30.3 లక్షల విలువైన చెక్కులు, ఐదుగురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నాయకులు ముప్పాల రాంచందర్‌రావు, సర్పంచులు రాజ్‌గోపాల్‌రావు పాల్గొన్నారు. అనంతరం మోతె పార్టీ కార్యాలయంలో 134 మందికి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందజేశారు.
జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
వెల్గటూర్: ఎండపల్లి మండలం గుల్లకోటకు చెందిన జైనపురం త్రిష జాతీయస్థా యి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ సాయికిరణ్ తెలిపారు. ధర్మారం మోడల్‌స్కూల్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న త్రిష.. నవంబర్‌లో నారాయణపేట జిల్లాలో జరిగిన 69వ ఎస్జీఎఫ్ పోటీల్లో అండర్–17 విభాగంలో ప్రతిభ కనబరిచింది. ఈనెల 19 నుంచి 23 వరకు గుజరాత్‌లోని సోమనాథ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. త్రిషను హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి శ్రీనివాస్, జెట్టిపల్లి అశోక్, సర్పంచ్ గొల్లపల్లి మల్లేశం, ఉప సర్పంచ్ జయవ్వ తదితరులు అభినందించారు.
వడ్డీలేని రుణాల పంపిణీ పూర్తి చేయాలి
జగిత్యాల: వడ్డీలేని రుణాలను పంపిణీ పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పట్టణప్రాంతాల్లో వడ్డీలేని రుణాలు పూర్తి చేయాలని, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటిల్లో వడ్డీలేని రుణాలు పంపిణీ పూర్తయ్యిందన్నారు. అర్హులందరికీ చీరలు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పాల్గొన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి..


