● హిందూసంఘాల ఆందోళన
మెట్‌పల్లి:
పట్టణంలోని ఆర్టీసీ ఇన్ గేట్ పక్కన ఉన్న హనుమాన్ ఆలయం వద్ద నిర్మిస్తున్న గద్దెను ఆర్టీసీ అధికారులు తొలగించే ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ గురువారం రాత్రి హిందూ సంఘాలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గద్దె నిర్మాణంతో ఎలాంటి ఇబ్బందులూ లేకపోయినప్పటికీ అధికారులు దానిని తొలగించేందుకు యత్నించడం సరికాదన్నారు. ఆందోళనతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అక్కడి చేరుకొని వారితో మాట్లాడారు. కొద్దిసేపటికి ఎంపీ అర్వింద్ అక్కడకు వచ్చి గద్దెను పరిశీలించారు. గద్దెతో ట్రాఫిక్‌కుగాని, ఇతర ఎలాంటి సమస్యకు దారి తీసే అవకాశం లేకపోయినప్పటికీ ఎందుకు తొలగిస్తున్నారని డీఎం సరస్వతీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని, నిర్మాణానికి సహాకరించాలని ఆమెకు సూచించారు.


