నేడు ప్రజాపాలనపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజాపాలనపై సమీక్ష

Mar 6 2026 9:07 AM | Updated on Mar 6 2026 9:07 AM

● హాజరుకానున్న మంత్రి తుమ్మల

కరీంనగర్‌ అర్బన్‌: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణపై కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమీక్షించనున్నారు. శుక్రవారం జిల్లాకు రానుండగా కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా సమావేఽశం నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

‘ప్రతిమ’ ఆర్థో వైద్యుడికి అవార్డు

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం నగునూరులోని ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్ధలో ఆర్థోపెడిక్‌ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి నూకలకు ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఆర్థోపెడిక్‌ అసోసియేషన్‌ –2025 కన్సల్టెంట్‌ విభాగంలో బెస్ట్‌ పేపర్‌ అవార్డు అందుకున్నారు. డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటివరకు 2 వేలకు పైగా ఇలిజారోవ్‌ శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ జాన్‌ ఇజ్రాయిల్‌, సీఏవో రాంచందర్‌రావు, రిజిస్ట్రార్‌ ప్రసాద్‌రావు, సూపరింటెండెంట్‌ సీఎన్‌ ప్రసాద్‌, ఏవో కల్యాణ్‌ చక్రవర్తి, హెచ్‌వోడీలు మోతిలాల్‌, నిఖిల్‌, వరుణ్‌కృష్ణ, అభిలాష్‌, నరేశ్‌, అనిల్‌కుమార్‌, తిరుపతి, ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement