మార్కెట్‌లో వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో వసతులు కల్పించాలి

Mar 6 2026 9:07 AM | Updated on Mar 6 2026 9:07 AM

డిప్యూటీ డైరెక్టర్‌ పద్మావతి

మెట్‌పల్లి: మార్కెట్‌ యార్డులో రైతులకు వసతులు కల్పించాలని మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పద్మావతి స్థానిక అధికారులకు సూచించారు. మార్కెట్‌ను ఆమె గురువారం సందర్శించారు. పసుపు కొనుగోళ్ల తీరుపై రైతులు, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. టాయ్‌లెట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆమెకు వివరించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కూన గోవర్దన్‌, మార్కెటింగ్‌ అధికారి ప్రకాశ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement