నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాలి

Jan 23 2026 7:03 AM | Updated on Jan 23 2026 7:03 AM

నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాలి

నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాలి

జగిత్యాల: నిబంధనలకు లోబడి ఎన్నికల విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఆర్వోలు, ఏఆర్వోలకు గురువారం శిక్షణ ఇచ్చారు. ఆర్వో, ఏఆర్వో ప్రతి అంశాన్ని తెలుసుకుని ముందుకెళ్లాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల విధులు చాలా కీలకమైనవన్నారు. ఎన్నికలకు ముందురోజు సామగ్రి సేకరించడం, పూర్తి సామగ్రి ఉందో లేదో సరిచూసుకోవడం, ఓటరు లిస్ట్‌, బ్యాలెట్‌ పేపర్‌ చెక్‌ చేసుకోవడం, చాలెంజ్‌ ఓటు, టెండర్‌ ఓటు, బ్యాలెట్‌ పేపర్స్‌ ఇవ్వడం, పీవో డెయిరీ నింపడం, అన్ని ఫాంలు ఎలా నింపాలి, ఎజెంట్స్‌ సిగ్నేచర్స్‌ ఎక్కడ తీసుకోవాలో అన్ని తెలిసి ఉండాలన్నారు. పోలింగ్‌ అయిన తర్వాత బ్యాలెట్‌ సీలింగ్‌, ఓటు కౌంటింగ్‌, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ నిర్వహణ, మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు ముందుకెళ్లాలన్నారు. అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, ఆర్డీవోలు శ్రీనివాస్‌, దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement