జగిత్యాల అభివృద్ధి కోసమే ఆరాటం
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: జగిత్యాల అభివృద్ధి కోసమే తన ఆరాటమని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. బుధవారం మోతె పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చొరవతో రూ.62.5 కోట్ల యూఐడీఎఫ్ నిధులు మంజూరయ్యాయని, మున్సిపాలిటీకి రూ.245 కోట్లు వచ్చాయని తెలిపారు. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే పేదలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు భవిష్యత్ తరాల కోసం ఆలోచించాలన్నారు. యావర్‌రోడ్డు విస్తరణకు కట్టుబడి ఉన్నానని, సీఎం కూడా హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభ్యర్థులకు సూచించారు. మెజార్టీ స్థానాలు గెలుచుకునేలా పనిచేయాలన్నారు. నాయకులు గట్టు సతీశ్, గిరి నాగభూషణం, చంద్రశేఖర్‌గౌడ్, దామోదర్‌రావు, చెట్‌పల్లి సుధాకర్, క్యాదాసు నాగ య్య, తోట మల్లికార్జున్, గంగాధర్ పాల్గొన్నారు.
మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
రాయికల్: బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే సూచించారు. పట్టణంలో కాంగ్రెస్ బీఫామ్ పొందిన అభ్యర్థులతో సమావేశమయ్యా రు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రతిఒక్కరూ గెలుపొందేలా చూడాలని పిలుపునిచ్చారు.


