భూ భారతి సర్వే సమర్థవంతంగా చేపట్టాలి
● అదనపు కలెక్టర్ బీఎస్.లత
జగిత్యాలరూరల్: భూభారతి సర్వే సమర్థవంతంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. గురువారం బీర్‌పూర్ మండలం వచ్చునూర్‌లో భూభారతి భూసర్వే, రీసర్వేపై అవగాహన కల్పించారు. సర్వేలో లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ సుజాత, అసిస్టెంట్ డైరెక్టర్ భూముల కొలతలు, రికార్డ్స్ అధికారి కిషన్‌ప్రసాద్, విఠల్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ శ్రీనివాస్, జీపీవో సత్యం, సుధాకర్, సర్పంచు రంగు లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
జగిత్యాల: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. వేడుకలపై అధికారులతో సమావేశమయ్యారు. గ్రౌండ్ సిద్ధం చేయాలని, పతాకావిష్కరణ, వేదిక, సిట్టింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. వైద్య బృందాలతో శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ ప్రగతి సందేశాన్ని వివరంగా అందించాలన్నారు. తాగునీరు, శానిటేషన్ చేపట్టాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ ఏర్పాటు చేసేలా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవో మధుసూదన్, ఏవో హకీం, డీఆర్డీవో రఘువరణ్ పాల్గొన్నారు.
కాలువ పనులకు నిర్వాసితులు సహకరించాలి
కథలాపూర్:సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనులకు భూనిర్వాసితులు సహకరించాలని ఆర్డీవో జివాకర్‌రెడ్డి కోరారు. గురువారం మండలంలోని గంభీర్‌పూర్‌లో రైతులతో సమావేశమయ్యారు. గ్రామ పరిధిలో 50 ఎకరాలు కాలువ పనులకు అవసరమన్నారు. భూ ములు కోల్పోతున్నవారికి ప్రభుత్వ నిబంధన ల ప్రకారం పరిహారం ఇస్తామన్నారు. రైతులు సహకరిస్తే పనులు త్వరగా ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్, ఆర్‌ఐ రవీందర్, సర్పంచ్ మనోహర్, రైతులు పాల్గొన్నారు.
రాయికల్ బల్దియాను అభివృద్ధి చేసిందే బీఆర్‌ఎస్
● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
రాయికల్: రాయికల్ బల్దియాను అభివృద్ధి చేసింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. పట్టణంలో ముఖ్యకార్యకర్తలతో గురువారం సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీని మున్సిపల్‌గా మార్చి రూ.25 కోట్లు మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో శూన్యమని ఆరోపించారు. అభివృద్ధి కోసమే పార్టీ మారిన ఎమ్మెల్యే మైతాపూర్ బ్రిడ్జి, ఇటిక్యాల బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ సభ్యత్వం లేని సంజయ్‌కి గాంధీభవన్‌లో ఏం పని అని ప్రశ్నించారు. ఎన్నికల్లో రాయికల్ బల్దియాపై బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్‌కుమార్, ఉపాధ్యక్షుడు వాసం రాజేందర్, కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ ఉదయశ్రీ, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, మాజీ కౌన్సిలర్లు శ్రీరాముల సత్యనారాయణ, మహేశ్‌గౌడ్, మహేందర్, బాబా, ప్రశాంత్ పాల్గొన్నారు.
24న నృసింహుడి బ్రహ్మోత్సవాలపై సమావేశం
జగిత్యాలరూరల్: బీర్‌పూర్ మండలకేంద్రంలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల (జాతర) ఏర్పాట్లపై ఈనెల 24న సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 30న సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణం, ఫిబ్రవరి ఒకటిన సాయంత్రం 6 గంటలకు డోలోత్సవం, తెప్పోత్సవం, 2న మధ్యాహ్నం 3 గంటలకు పార్వెట ఉత్సవం, 6న మధ్యాహ్నం 3.30 గంటలకు రథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అధ్యక్షతన జాతర సమన్వయ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భూ భారతి సర్వే సమర్థవంతంగా చేపట్టాలి
భూ భారతి సర్వే సమర్థవంతంగా చేపట్టాలి


