కాల్వ రాంచంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సింగిల్‌విండో చైర్మన్‌గా, సర్పంచ్‌గా, ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా కాల్వ రాంచంద్రారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు అన్నారు. మాజీ ఎమ్మెల్యే కాల్వ రాంచంద్రారెడ్డి 33వ వర్ధంతిని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ సింగిల్‌విండో కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి తదితరులు కాల్వ రాంచంద్రారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు, రైతులు, ఆర్టీసీ ప్రయాణికులు, మల్లికార్జునస్వామి భక్తులకు రాంచంద్రారెడ్డి అనేక సేవలు చేశారన్నారు. 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.కోట్ల విలువైన భూదానం చేసి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన మహనీయుడని గుర్తుచేశారు. తండ్రి బాటలోనే ఆయన తనయుడు, సాక్షి దినపత్రిక డైరెక్టర్ (ఆర్గనైజింగ్ అండ్ మార్కెటింగ్) కాల్వ రాజప్రసాద్‌రెడ్డి, సోదరులు వెంకటేశ్వర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి సింగిల్‌విండో కార్యాలయానికి భూమి విరాళంగా అందించారని ప్రశంసించారు. తద్వారా రైతులు, ప్రజల ఆదారాభిమానాలు, ప్రశంసలు అందుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో సీఈవో కోలేటి శ్రీనివాస్, ఉద్యోగులు యాట శ్రావణ్‌కుమార్, ముస్కు రాజు, ఆరెల్లి శ్రీనివాస్, రత్నం, ఆశ, విష్ణు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పలువురు ప్రముఖులు
ఘనంగా మాజీ ఎమ్మెల్యే వర్ధంతి


