అంజన్న సన్నిధిలో సమాచార కమిషనర్ పూజలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని ఆదివారం రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీని వాస్‌రావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. తహసీల్దార్ వసంత, ఆర్‌ఐ తిరుపతి పాల్గొన్నారు.
చింతకుంటలో పులి వదంతులు
కథలాపూర్(వేములవాడ): మండలంలోని చింతకుంట శివారు అటవీప్రాంతంలో గ్రామస్తులకు పులి కనిపించిందని ప్రచారం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం అటవీశాఖ అధికారులకు తెలియడంతో వారు అటవీప్రాంతంలో పర్యటించారు. పులి సంచరినట్లు చెప్పిన ప్రాంతంలో పరిశీలించారు. అక్కడ కనిపించిన పాదముద్రల ప్రకారం.. నక్కగా నిర్ధారించారు. నక్కలో హైనా రకం అని అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ ముస్తాక్ ఆలీ పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పతకానికి ఏఎస్సై
● అభినందించిన ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: కేంద్రంప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్(ఎంఎస్‌ఎం) మెడల్‌కు స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై ఆనందం ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 12మందికి ఎంఎస్‌ఎం మెడల్ లభించగా వారిలో ఆనందం ఒకరు. 1989లో కానిస్టేబుల్‌గా చేరిన ఆనందం.. 2012లో హెడ్‌కానిస్టేబుల్‌గా, 2020లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. రాష్ట్ర పోలీస్ సేవ పతకం, 2018లో ఉత్తమ సేవ పతకానికి ఎంపికయ్యారు. 37 ఏళ్లుగా విధుల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న ఆనందంను ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు.
ప్రకృతి వనరులు కాపాడండి
● మాజీమంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: ప్రభుత్వం మారినా జిల్లాలోని నర్సింగాపూర్ గుట్టల దోపిడీ మాత్రం ఆగడం లేదని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గుట్టలు ప్రకృతి వరమని, వాటిని కాపాడుకోవాలని సూచించారు. దశాబ్దకాలంగా మట్టి తవ్వకాలతో గుట్టలు కరిగిపోయాయని, కాంగ్రెస్ అధికారంలోకొచ్చినా అక్రమ తవ్వకాలు ఆగడం లేదన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. నాయకులు జున్ను రాజేందర్, శీలం సురేందర్, పుప్పాల అశోక్, చందా రాధాకిషన్, కమటాల శ్రీనివాస్, రఘువీర్‌గౌడ్, సాయి, జెల్ల రవీందర్ ఉన్నారు.
అంజన్న సన్నిధిలో సమాచార కమిషనర్ పూజలు
అంజన్న సన్నిధిలో సమాచార కమిషనర్ పూజలు
అంజన్న సన్నిధిలో సమాచార కమిషనర్ పూజలు


