ఇటుకబట్టీతో పంట నష్టపోతున్నాం
మేం మల్యాల మండలం పోతారం, గొల్లపల్లె రైతులం. రాజారం శివారులో వ్యవసాయం చేసుకుంటున్నాం. పొలాల పక్కన మూడెకరాల మే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కొందరు ఇటుకబట్టీ నిర్వహిస్తున్నారు. ఒర్రె నుంచి నీరు వెళ్లే అవకాశం లేక పొలాల్లోనే నిలిచిపోతుంది. బూడిద, కాలుష్యంతో పంటలు పండటం లేదు. పర్యావరణానికి ముప్పుగా మారిన బట్టీని తొలగించండి. ఒర్రె తిరిగి పారేలా చర్యలు తీసుకోండి.
– పోతారం, గొల్లపల్లి రైతులు
వార్డు రిజర్వేషన్లు సవరించండి
మాది మెట్‌పల్లి. వార్డుల రిజర్వేషన్లలో రొటేషన్, జనాభా ప్రాతిపదికన చేపట్టలేదు. ఎస్సీ కులస్తులకు అన్యాయం జరిగింది. పొరపాట్లను సరిచేయండి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఇంకా సమయం ఉన్నందున రొటేషన్, జనాభా ప్రాతిపదికన శాసీ్త్రయ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించి ఎస్సీ సామాజికవర్గానికి న్యాయం చేయండి.
– ఏ పురుషోత్తం, మాజీ కౌన్సిలర్, మెట్‌పల్లి
ఇటుకబట్టీతో పంట నష్టపోతున్నాం


