పోదామా.. సమ్మక్క జాతర
గొల్లపల్లి: రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క సారలమ్మ జాతరకు గద్దెలు సిద్ధమయ్యాయి. అమ్మవార్ల దర్శనానికి జిల్లాలోని గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్, వెల్గటూర్, రాజారాంపల్లి, ధర్మపురి మండలంలోని రామయ్యపల్లి గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. సారలమ్మ రాకతో నేటినుంచి జాతర ప్రారంభం అవుతుంది. 31వ తేదీ వరకు నిర్వహిస్తారు. జాతర కమిటీ, గ్రామపంచాయతీలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. గద్దెలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయం, ఏర్పాట్లు చేస్తున్నారు.
చిల్వాకోడూర్‌కు రద్దీ ఎక్కువ
చిల్వాకోడూర్ ఎక్స్‌రోడ్ సమీపంలో ఎక్కల్‌దేవి గుట్ట కింద సమ్మక్క సారలమ్మ గద్దెలు, జంపన్న వాగు, విశాలమైన మైదానం ఉండటంతో పాటు, కరీంనగర్, జగిత్యాల, ధర్మారం నుంచి హైవే, గద్దెల సమీపంలోనే బస్టాండ్ ఉండటంతో భక్తుల ప్రయాణానికి సౌకర్యంగా ఉంటుంది. దీంతో ఇక్కడికి అధిక సంఖ్యలో వచ్చి మొక్కలు చెల్లించుకుంటారు. 2024లో భక్తుల సంఖ్య 1.50 లక్షల వరకు రావడంతో ఈ ఏడాది 2 లక్షలకు పైగా భక్తులు రానున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
జాతర తేదీలు
గొల్లపల్లి మండలంలోని చిల్వాకోడూర్, వెల్గటూర్, రాజారంపల్లి, ధర్మపురి మండలంలోని రామయ్యపల్లి గ్రామాల్లో నేటి బుధవారం నుంచి 31వ తేదీ వరకు జాతర నిర్వహిస్తారు. 28న బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కంకవనం గద్దెకు తెస్తా రు. సాయంత్రం 5 గంటలకు సారలమ్మ గద్దెకు చే రుకుంటారు. 29న గురువారం సాయంత్రం సమ్మ క్క గద్దెకు వస్తుంటారు. 30న శుక్రవారం మొక్కులు చెల్లించుకుంటారు. 31న శనివారం సాయంత్రం దే వతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, ధర్మారం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కలదని సర్పంచ్ దాసరి తిరుపతి, ఉత్సవ కమిటీ ఫౌండర్ చైర్మన్ గందె భాస్కర్, ఉపాధ్యక్షుడు చేని రాములు తెలిపారు. రాజారాంపల్లిలో ఏలేటి వంశీయులు 2011లో ఏర్పాటు చేసిన గద్దెలపై నేటికి జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈసారి కూడా జాతర ఏర్పాట్లు భారీగా నిర్వహిస్తున్నామని చైర్మన్ ఏలేటి శైలేందర్‌రెడ్డి వివరించారు.


