బండి భగీరథ్‌ను అరెస్ట్‌ చేయాలని.. | - | Sakshi
Sakshi News home page

బండి భగీరథ్‌ను అరెస్ట్‌ చేయాలని..

May 12 2026 12:38 AM | Updated on May 12 2026 12:38 AM

జగిత్యాలటౌన్‌/కోరుట్ల: బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు జిల్లాకేంద్రంలోని తహసీల్‌ చౌరస్తాలో.. కోరుట్లలోని కొత్త బస్టాండ్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ మాట్లాడుతూ భగీరథ్‌పై కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నా పోలీసులు చర్యలు చేపట్టకపోవటం సరికాదన్నారు. సామాన్యులపై కేసు నమోదైతే వెంటనే అరెస్టు చేసే పోలీసులు ఎప్పుడు ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. పోక్సో కేసు నమోదైన 24గంటల్లో నిందితుడిని అరెస్టు చేయాల్సిన పోలీసులు మూడు రోజులుగా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సిలర్‌ దేవేందర్‌నాయక్‌రాథోడ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement