వేసవి శిబిరాలు వినియోగించుకోండి | - | Sakshi
Sakshi News home page

వేసవి శిబిరాలు వినియోగించుకోండి

May 12 2026 12:38 AM | Updated on May 12 2026 12:38 AM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

వెల్గటూర్‌/బుగ్గారం: విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి మోడల్‌ స్కూల్‌లో సోమవారం సమ్మర్‌ క్యాంప్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గానికొక యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం చేస్తున్నామని అన్నారు. ప్రిన్సిపాల్‌ కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బుగ్గారం, గోపులాపూర్‌లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్‌ లత, నాగారం సర్పంచ్‌ చిలుముల లక్ష్మణ్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement