జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మంగళవారం 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాయికల్ మండలం అల్లీపూర్‌లో 45.3, బీర్‌పూర్ మండలం కొల్వాయి, ఇబ్రహీంపట్నం గోదూరులో 45, ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లిలో 44.7, రాయికల్‌లో 44.6, ధర్మపురి మండలం జైనలో 44.4, కోరుట్ల మండలం అయిలాపూర్, ధర్మపురి మండలం నేరెళ్లలో 44.3, ఎండపల్లి, మెట్‌పల్లిలో 44.2, మేడిపల్లిలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కథలాపూర్ అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్
కథలాపూర్: కథలాపూర్ అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ ఎండీ.ముస్తాక్‌అలీని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో బీట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో సెక్షన్ ఆఫీసర్‌కే బీట్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా అటవీశాఖలో వివాదం చోటుచేసుకుంటోంది. ఈ విషయంలోనే ముస్తాక్‌అలీ అసంతృప్తితో అనుమతి లేకుండా 19 రోజులు సెలవుపై వెళ్లారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు అలీని సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో కుమ్మరి పూర్ణిమ బాధ్యతలు తీసుకున్నారు. ఈమె అటవీ శాఖ జిల్లా మొబైల్ పార్టీలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
క్షయ నివారణకు కృషిచేయాలి
గొల్లపల్లి: క్షయ నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం డిజిటల్ మొబైల్ ఎక్స్‌రే మిషన్‌తో క్షయ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే తెమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు. సుమారు 72 మందికి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి శ్రీకాంత్, పర్యవేక్షకులు నరేందర్, ఎస్టీస్ శ్రీనివాస్, రేడియోగ్రాఫర్స్ వికాస్, రాజీవ్ పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్
కోరుట్ల: కోరుట్ల మున్సిపల్ కమిషనర్‌గా ఎం.శ్రీనివాస్‌రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ ఉద్యోగులు కమిషనర్‌కు స్వాగతం పలికారు. అనంతరం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అధికారులను, సిబ్బందిని పరిచయం చేసుకున్నారు.
గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
జగిత్యాలరూరల్: ఇండియా, ఖతర్ లేబర్ మైగ్రేషన్ కారిడార్‌లో ఇరుదేశాల్లో సంఘాల సమన్వయంతో కార్మికుల సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలంగాణ ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మంద భీంరెడ్డి తెలిపారు. మంగళవారం ఖతర్ నుంచి ‘సాక్షి’తో మాట్లాడారు. వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బీడబ్ల్యూఐ) ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గ్లోబల్ ఆర్గనైజింగ్ అకాడమీ, ఆసియా పసిఫిక్ అనే సంస్థ ఈనెల 4, 5 తేదీల్లో ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో కార్మిక సంఘాల ప్రతినిధులకు రెండు రోజుల శిక్షణ ఇచ్చిందన్నారు. 10 దేశాల్లో 22 అనుబంధ సంస్థల నుంచి 42 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు. ఖతార్‌లోని తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధు పాల్గొని స్వ దేశం, విదేశంలో పనిచేసే రెండు వేర్వేరు సంఘాలు సమన్వయంతో పనిచేస్తే.. వలస కా ర్మికుల సమస్యలను వేగంగా, సులువుగా పరి ష్కరించవచ్చని సూచించినట్లు పేర్కొన్నారు.


