జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేటకు
చెందిన బొడ్డు మనీష అనే మహిళా రైతు ఎఫ్‌సీఐకి విక్రయించేందుకు జగిత్యాల మార్కెట్‌యార్డులో 10రోజుల క్రితం మక్కలు పోసింది. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. హమాలీల కొరత తీవ్రంగా ఉంది. సోమవారం ఉదయం మార్కెట్ అధికారులు ఆమెకు గన్నీ బ్యాగులు ఇచ్చారు. దీంతో మనీష తన ఇద్దరు కూతుళ్లను వెంటబెట్టుకుని వచ్చి మార్కెట్‌లో
ఇలా మక్కలను సంచుల్లో నింపింది.


