జగిత్యాల: స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ మ్యాపింగ్ (సర్) మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్‌తో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మ్యాపింగ్ ప్రక్రియలో పొరపాట్లకు తావు లేకుండా ప్రతి ఇంటి నుంచి కచ్చితమైన వివరాలు సేకరించాలని, తప్పుడు ఎంట్రీలు, లింక్ జరగకుండా చూడాలని సూచించారు. బీఎల్వోలు ఫీల్డ్ విజిట్ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. జూన్ 25 నుంచి జూలై 14 వరకు హౌస్ టు హౌస్ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో వందశాతం ‘సర్’ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఇంటి నుంచి సరైన, నిర్ధిష్టమైన సమాచారం తీసుకుని మ్యాపింగ్ ప్రక్రియ కట్టుదిట్టంగా చేస్తున్నామని పేర్కొన్నారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ లత, మధుసూదన్, దివాకర్‌రెడ్డి ఉన్నారు.


