కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ సీబీఎస్‌ఈ సీనియర్ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థులు బుధవారం ప్రకటించిన 12వ తరగతి ఫలితాల్లో అత్యున్నత మార్కులతో జయకేతనం ఎగురవేసినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఏడుగురు విద్యార్థులు 460పైగా, 47 మంది విద్యార్థులు 400 మార్కులు పైగా సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పీసీఎం విభాగంలో వి.శ్రేయాస్‌రెడ్డి 475 మార్కులతో పాఠశాల టాపర్‌గా నిలవగా, జి.చైత్ర 471 మార్కులు, ఎన్.రత్నప్రకాశ్ 469, బి.లిఖిత్ సాయి 461, ఐశ్వర్య 458, హర్షఫ్ అర్మాన్ 456, వి.సాయి హర్షిత్ 456, బి.రోహిత్, ఎన్.కావ్య, జె.సరయు 450 మార్కులు సాధించారన్నారు. అదేవిధంగా పీసీబీ విభాగంలో డి.రుత్విక్ 476 మార్కులతో పాఠశాల టాపర్‌గా, పి.శృత్విక 472, డి.శ్రేయన్ష్ 462 సాధించగా మిగిలిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు వివరించారు. అధ్యాపకుల నిరంతర కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు.


