మహిళా సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

మహిళా సంక్షేమానికి పెద్దపీట

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

పెగడపల్లి: మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని బతికపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు, దోమలకుంట, సుద్దపల్లిలో రూ.30లక్షలతో నిర్మించనున్న మహిళా సంఘం భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయాలని సంకల్పించామన్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, గ్యాస్‌ సిలిండర్‌, రెండు వందల యూనిట్ల వరకు కరెంట్‌ వంటి కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయన్నారు. వెనుకబడిన బతికపల్లి అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటానన్నారు. సీసీరోడ్లు, మురికికాల్వలు, కులసంఘాల భవనాలు, పల్లె దవాఖానాలకు నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్‌ రాములుగౌడ్‌, సర్పంచులు ముంజ మహేశ్వరీ, బండారి మణెమ్మ, ఐతరవేని లక్ష్మణ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ సత్తిరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కడారి తిరుపతి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ కిశోర్‌, రాజ్‌కుమార్‌, తహసీల్దార్‌ సయ్యద్‌ నిజామొద్దీన్‌, ఎంపీవో శశికుమార్‌రెడ్డి, హౌజింగ్‌ ఏఈ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు నిఖిల్‌రెడ్డి, మహేశ్‌, నదీం, ఏఎంసీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

వెల్గటూర్‌: కాంగ్రెస్‌ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి కోరారు. కాంగ్రెస్‌ ఎండపల్లి మండల అధ్యక్షుడిగా గెల్లు చంద్రశేఖర్‌ యాదవ్‌ ఎన్నికై న సందర్భంగా రాజారాంపల్లిలో శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. పార్టీ మండలాల అధ్యక్షులు అన్ని గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మాజీ అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement