ధాన్యం తరలింపు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తరలింపు వేగవంతం చేయండి

May 16 2026 1:33 AM | Updated on May 16 2026 1:33 AM

జగిత్యాల: వరిధాన్యం కొనుగోళ్లు, రవాణా, మిల్లుల్లో అన్‌లోడింగ్‌ వేగవంతం చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సివిల్‌ సప్‌లై అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మిల్లుల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలవకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. మిల్లుల్లో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ నిరంతరం జరగాలన్నారు. పెండింగ్‌లో ఉన్న లారీలను వెనువెంటనే ఖాళీ చేయాలన్నారు. ధాన్యం నిల్వలు ఎక్కువ కాలం చేయకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్యలుంటే త్వరగా పరిష్కరించాలని సూచించారు.

ప్రజలకు మరిన్ని సేవలందించాలి

రెడ్‌క్రాస్‌ ససైటీ ఆధ్వర్యంలో ప్రజలకు మరిన్ని సేవలందించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. శుక్రవారం రెడ్‌క్రాస్‌ సభ్యత్వ నమోదును ప్రారంభించి మాట్లాడారు. రెడ్‌క్రాస్‌ సభ్యత్వ నమోదు ఈనెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు ఉంటుందని, ప్రజలందరూ నమోదు చేసుకోవాలన్నారు.

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement