పట్టణంలోని 25వార్డులో ఉన్న పబ్లిక్ బోరు ఇది. దీనిపై 20 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కొన్నేళ్లుగా దీనికి మరమ్మతు చేపట్టకుండా వదిలేశారు. నల్లాల ద్వారా భగీరథ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి సరిపోక ఆయా కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. దీనిని వినియోగంలోకి తీసుకొస్తే నీటి కొరత ఉండదని వారు చెబుతున్నారు.
ఇది మెట్‌పల్లి పట్టణంలోని 12వార్డు అర్బన్ హౌజింగ్ కాలనీలోని ఓ వీధిలోగల చేతి పంపు. కొంతకాలంగా ఇది పని చేయడం లేదు. మరమ్మతు చేపట్టే విషయంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతుండడంతో స్థానికంగా పలు కుటుంబాలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇదొక్కటే కాదు ఈ కాలనీలో ఇంకా పలు చేతిపంపులు మరమ్మతు లేక నిరుపయోగంగా ఉన్నాయి.
మెట్‌పల్లి: రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగిపోతుండడంతో పట్టణంలో భూగర్భజలాలు వట్టి పోతున్నాయి. తద్వరా నీటి కొరత ఏర్పడి పలు వార్డుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవికి ముందే అధికారులు పనిచేయని చేతి పంపులు, పబ్లిక్ బోర్లను గుర్తించి మరమ్మతు చేయించాల్సి ఉండగా.. కొన్నిటికి మాత్రమే చేయించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వీటిపైనే ఆధారపడ్డ కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయి.
రెండు నెలలు గడిచినా..
దృష్టికి తీసుకొస్తే చర్యలు
పట్టణంలో చాలాచోట్ల పని చేయని పబ్లిక్ బోర్లు, చేతి పంపులకు మర్మమతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చాం. ఎక్కడైనా పని చేయనివి ఉంటే ప్రజలు మ దృష్టికి తీసుకొస్తే మరమ్మతు చేస్తాం. నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం.
– నాగేశ్వర్‌రావు,
మున్సిపల్ డీఈఈ


