వేములవాడ: మండుతున్న ఎండలను లెక్క చేయకుండా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆదివారం పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో వేములవాడకు చేరుకుని తమ ఇలవేల్పు రాజన్న, భీమన్నలకు మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీని గమనించిన ఆలయ అధికారులు భక్తులకు సరిపడా సౌకర్యాలు కల్పించారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు తాగునీటి క్యాన్లను అందుబాటులో ఉంచి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులచే నీటి సరఫరా చేయించారు.
భీమన్న సేవలో సుడా చైర్మన్
వేములవాడ భీమన్నను శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారి మండపంలో శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, ఆశీర్వచనాలు అందించారు.


