కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించాలి

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

కొడిమ్యాల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించడం లేదంటూ రైతులు రోడ్డెక్కారు. కొడిమ్యాల మండలం పూడూరు చౌరస్తాలో సోమవారం జగిత్యాల–కరీంనగర్‌ జాతీయ రహదారిపై బైఠాయించారు. 43కిలోలు బదులు 40 కిలోలకే తూకం వేయాలని రోడ్డుపై వడ్లు పోసి నిరసన తెలి పారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఆందోళనతో ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. మహిళా రైతులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో స్వల్ప తోపులాట జరిగింది. జీవన్‌రెడ్డి, రవిశంకర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రేవంత్‌రెడ్డి పోవాలి కేసీఆర్‌ రావాలి అంటూ రైతులు నినాదాలు చేశారు. కలెక్టర్‌ వచ్చేంతవరకు ఆందోళన విరమించని పట్టుబట్టడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చించారు. రైతుల డి మాండ్‌ మేరకు 40 కిలోలకే తూకం వేసి, ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని రా తపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమి ంచారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటేశ్‌, నాయకులు, మండల రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement