● కలెక్టర్ సత్యప్రసాద్
మల్లాపూర్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని ముత్యంపేట, రాఘవపేట, మొగిలిపేటలో కొనుగోలు కేంద్రాలు, మిల్లులను తనిఖీ చేశారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అకాల వర్షాలు ఉన్నందున గన్నీసంచులు, టా ర్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ట్యాబ్ డాటా ఎంట్రీ ఆన్‌లైన్ చేసి రైతులకు ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూడాలన్నారు. మెట్‌పల్లి ఆర్డీవో నరసింహరావు, సీవిల్ సప్లయ్ డీఎం జితేంద్రప్రసాద్, తహసీల్దార్ రాంచందర్, ఆర్‌ఐలు రాజేష్, అశోక్, ఐకేపీ ఎపీఎం విమోచన, సీసీలు, ప్యాక్స్ సీఈవోలు, రైతులు పాల్గొన్నారు.
‘ఎస్‌ఐఆర్’ పకడ్బందీగా చేపట్టాలి
జగిత్యాల: స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈఆర్‌వో, ఏఈఆర్‌వో, బీఎల్‌వోలు యాప్‌లపై శిక్షణ పొందాలన్నారు. ఓటరు జాబితా సవరణ విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏవో కిషన్, నరేష్, ఏడీఎం మమత పాల్గొన్నారు.
ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం
పెగడపల్లి: ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. క్వింటాకు 5 నుంచి 6 కిలోలు కోత విధిస్తున్నారని పేర్కొన్నారు. మండలంలోని కీచులాటపల్లిలో బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి గురువారం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడారు. నెల రోజులుగా రైతులు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ పాలనలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదన్నారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, నా యకులు నరేందర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వీరేశం, ఆనందం, గంగాధర్ పాల్గొన్నారు.
ధర్మదీక్ష పేరిట రాజకీయం
రాయికల్: కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయం చేయడం తగదని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్‌లో విలేకరులతో మాట్లాడారు. స్థలం కేటాయింపు కోసం ఇరిగేషన్ మంత్రికి వినతిపత్రాలు అందించానని తెలిపారు. నవోదయ పాఠశాలను కోరుట్లకు ఇచ్చి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చిన తర్వాతే ఇతరులకు ఇచ్చే కేవిని జగిత్యాలకు మంజూరు చేశారని, దీనికి ఎంపీ అర్వింద్ ధర్మదీక్ష పేరుతో రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నా రు. అయినప్పటికీ స్థలం కేటాయించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు ఏనుగు మల్లారెడ్డి, దీటి రాజిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, కౌన్సిలర్లు పల్లికొండ గంగాధర్, రాకేష్‌నాయక్, మచ్చ గంగలక్ష్మి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బెజ్జంకి మోహన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రావు, నాయకులు పాల్గొన్నారు.


