రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

కథలాపూర్‌(వేములవాడ): కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. మండలంలోని సిరికొండ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామశివారులో ఉన్న రైస్‌ మిల్లులను తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్‌ పక్రియ, అన్‌లోడింగ్‌పై యజమానులను అడిగి తెలుసుకున్నారు. మిల్లుల్లో హమాలీల కొరత ఉందంటూ జాప్యం చేయొద్దన్నా రు. లారీల కొరత ఉంటే ట్రాక్టర్లలో రవాణా చేయాలన్నారు. ఆర్డీవో జివాకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ జీవన్‌రెడ్డి, తహసీల్దార్‌ రమేశ్‌, ఎస్సై నవీన్‌కుమార్‌, ఆర్‌ఐ రవీందర్‌ ఉన్నారు.

ప్రధాని దిష్టిబొమ్మ దహనం

కోరుట్ల: నీట్‌ పరీక్షా పత్రం లీక్‌ కావటాన్ని నిరసిస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్‌ శ్రేణులు పట్టణంలోని బస్టాండ్‌ వద్ద శనివారం దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ వి ద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న అధి కారులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరుమల గంగాధర్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, కో–ఆప్షన్‌ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

దోమల నిర్మూలన అందరి బాధ్యత

జగిత్యాల: దోమల నిర్మూలన అందరి బాధ్యత అని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివా రం ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో గతేడాది 27 డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఈసారి కేసులు లేకుండా చూడాలన్నారు. ఇప్పటికే జిల్లాలో 42 హైరిస్క్‌ గ్రామాలు, 14 హైరిస్క్‌ మండలాల్లో బ్రీడింగ్‌ పాయింట్స్‌, హాట్‌స్పాట్లను గుర్తించి వ్యాధి బారిన పడకుండా చూసుకోవాలన్నారు. జిల్లాను డెంగీ రహిత జిల్లాగా మార్చాలన్నారు. ప్రో గ్రాం ఆఫీసర్‌ అర్చన, డాక్టర్‌ స్రవంతి, సత్యనారాయణ, శ్రీధర్‌, రాజేశం, మురళీ, శ్యామ్‌ పాల్గొన్నారు.

యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు

ధర్మపురి: భరణి నక్షత్రం సందర్భంగా శ్రీయమధర్మరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు బొజ్జ సంతోష్‌కుమార్‌, రాజగోపాల్‌ ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

నృసింహునికి స.హ చట్టం కమిషనర్‌ పూజలు

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామిని సమాచార హక్కు చట్టం కమిషనర్‌ పీవీ.శ్రీనివాసరావు, దేశాల భూపాల్‌ శనివారం దర్శించుకున్నారు. వారికి ఆలయం పక్షాన స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ ఎస్‌.దినేష్‌, ఆలయ సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాలు శ్రీనివాస్‌, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement