● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు లాభదాయక పంటలు సాగు చేసి.. మంచి ఆదాయం పొందాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఉద్యానపంటలపై సదస్సు నిర్వహించారు. రైతులు పండించడంతోపాటు మార్కెటింగ్ నైపుణ్యాన్ని అలవర్చుకోవాలన్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్‌మీడియాను ఉపయోగించుకుని ఉత్పత్తులను అమ్ముకునే స్థాయికి ఎదగాలన్నారు. దొడ్డు రకం ధాన్యం తగ్గించి సన్నాలు సాగు చేయాలని సూచించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి లత, ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వాతి, ప్రత్యేక అధికారి రమేశ్ పాల్గొన్నారు.
హిందువుల్లో ఐక్యత పెరగాలి
రాయికల్: హిందువుల్లో ఐక్యత పెరిగితేనే ధర్మం చిరకాలం వర్ధిల్లుతుందని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సహ కార్యవాహ్ సాయి మధుకర్ అన్నారు. మంగళవారం రాయికల్ మండలం ఇటిక్యాలలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. గ్రామంలో సామూహిక భజన, గోపూజ, హనుమా న్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ గోమాతను పూజించాలని, గోవులో సర్వదేవతలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో స ర్పంచ్ నీరటి శ్రీనివాస్ హిందువులు పాల్గొన్నారు.


