ఇబ్రహీంపట్నం: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ సత్యప్రసా ద్ సూచించారు. మండలంలోని తిమ్మాపూర్, గో ధూర్, ఇబ్రహీంపట్నంలో కొనుగొలు కేంద్రాలను పరిశీలించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. రైతులు తమ ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తరలిస్తే కిరాయి చెల్లిస్తామని తెలిపారు. అకాల వర్షాలు ఉన్నందున నిర్వాహకులు గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని పేర్కొన్నారు.


