జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో సోమవారం 45.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మల్లాపూర్ మండలం రాఘవపేటలో 45.7, ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లిలో 45.6, ఎండపల్లి మండలం గుల్లకోట, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో 45.5, ధర్మపురి మండలం నేరేళ్లలో 45.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రాయికల్ మండలం అల్లీపూర్, బీర్‌పూర్ మండలం కొల్వాయిలో 44.9, ధర్మపురి మండలం జైనాలో 44.8, మెట్‌పల్లిలో 44.6, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో 44.5, సారంగాపూర్‌లో 44.4, మల్లాపూర్‌లో 44.3, కొడిమ్యాల మండలం పూడూర్‌లో 44.2, గొల్లపల్లిలో 44.0 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.
జయంతి ఉత్సవాలకు రండి
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 10నుంచి 12వరకు నిర్వహించే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు రా వాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లకు ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వాన పత్రిక అందించారు. ఆలయ ఈవో అంజనారెడ్డి, ఉప ప్రధాన అర్చకులు చి రంజీవ స్వామి, వేద పండితులు పెద్దన్న శర్మ, సూపరిండెంట్ సునీల్‌కుమార్ పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరణ
జగిత్యాలక్రైం: జగిత్యాల డీఎస్పీగా నియమితులైన పురుషోత్తంరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ రఘుచందర్ నూతన డీఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి బాధ్యతలు అప్పగించారు.
సహకార సంఘ చైర్మన్లకు నేటి నుంచి బాధ్యతలు
జగిత్యాలరూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల చైర్మన్ల పదవీ కాలం పూర్తి కావడంతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం వారి పదవీ కాలాన్ని కొద్దిరోజులు పొడిగించింది. వెంటనే ప్రభుత్వం వారి పదవీకాలాన్ని రద్దు చేస్తూ ప్రత్యేకాధికారులను నియమించారు. దీంతో సహకార సంఘ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించే వరకు పాత సహకార సంఘాల పాలకవర్గ సభ్యులకే పదవీ బాధ్యతలు అప్పగి ంచాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంగళవారం జిల్లాలోని 52మంది సంఘాల చైర్మన్లు తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు.
క్షయతో
అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాల: క్షయవ్యాధితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. సోమవారం గాయత్రి ఓల్డేజ్ హోంలో వృద్ధులకు పరీక్షలు నిర్వహించారు. రెండు వారాలకు మించి దగ్గు, రాత్రి చెమటలు పట్ట డం, బరువు తగ్గడం, చాతిలో పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆయన వెంట సూపర్‌వైజర్ శ్రీనివాస్, వికాస్ పాల్గొన్నారు.
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
జగిత్యాల: వరిధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. వరిధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేవని జీవన్‌రెడ్డి ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రశ్నించే గొంతుకగా చెప్పుకునే జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్ గొంతుగా మారిపోయాడని అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రైతులకు వ్యవసాయానికి రూ.2.68 కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ రెండేళ్లలో 1.52 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్‌కుమార్ నిత్యం కలెక్టర్‌తో సమీక్షలు నిర్వహిస్తూ ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం జరిగిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని, ధా న్యం కొనుగోళ్లు త్వరితగతిన జరిగేలా చూస్తామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, శంకర్ పాల్గొన్నారు.


