బురదజల్లే ప్రయత్నం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

బురదజల్లే ప్రయత్నం చేయొద్దు

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

జగిత్యాల: ఎంపీ అర్వింద్‌ చేపట్టే ధర్మదీక్ష రాజకీయ డ్రామా అని, తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. మోతె పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు సీట్లు కేటాయించిన అనంతరమే ఇతరులకు వస్తాయని గుర్తు చేశారు. స్థలం కేటాయించడం లేదని ఎంపీ అర్వింద్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. పేదలకు అవసరమైన నవోదయను కోరుట్లలో ఏర్పాటు చేశామన్నారు. కొన్ని కారణాలతో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని, చల్‌గల్‌లో ఇప్పించాలని మంత్రులను కలిశానని తెలిపారు. జగిత్యాలకు ఇంటిగ్రేటెడ్‌, తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు మంజూరయ్యాయన్నారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నాగభూషణం, శంకర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ధర్మదీక్ష రాజకీయ డ్రామా

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement