మెట్‌పల్లి: పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జనరల్ ఫండ్ నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులను చైర్మన్ మైలారపు లింబాద్రితో కలిసి ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నర్సింగరావును పాలకవర్గ సభ్యులు సన్మానించారు. వైస్‌చైర్మన్ ఓంకారి నవీన్, కమిషనర్ శ్రీనివాస్‌గౌడ్, డీఈఈ నాగేశ్వర్‌రావు, కౌన్సిలర్లు ఉన్నారు.
నెరవేరుతున్న పేదల సొంతింటి కల
మల్లాపూర్: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతోందని నర్సింగరావు అన్నారు. మండలంలోని చిట్టాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహాప్రవేశానికి హాజరయ్యారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సర్పంచ్ సంపతి శంకరమ్మ, ఉపసర్పంచ్ బాలసాని ప్రణయ్‌గౌడ్, మాజీ సర్పంచ్ కడకుంట్ల సాయికుమార్ పాల్గొన్నారు.


