రాజకీయాలకతీతంగా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

రాజకీయాలకతీతంగా అభివృద్ధి

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల: రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడుతున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజ య్‌కుమార్‌ అన్నారు. 99రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, యువతకు క్రీడలు, విద్యుత్‌, పిల్లల భద్రతలో ముందుకెళ్తున్నామని పేర్కొన్నా రు. వైకుంఠదామాలు, పల్లెప్రకృతి, పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరుగా ఇచ్చి ప్రజలు సహకరించాలన్నారు. నియోజకవర్గంలో 78 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ అందుతోందని, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణా ల్లో అభివృద్ధి పనులను పూర్తిచేయాలన్నారు. సేవల్లో పారదర్శకత, నాణ్యత ఉండేలా చూడాలన్నా రు. ఎస్సీ అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్‌, ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో ని రోటరీ పార్క్‌ పక్కన రూ.48 లక్షలతో బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అమృత్‌ స్కీంలో నిధులున్నాయని, అధికారులు పనులను వేగవంతం చేయాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్‌, నిమ్మల నాగరాజు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గిరి నాగభూషణం, గట్టు సతీశ్‌, గోలి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement