జగిత్యాలరూరల్: గీత కార్మికులు ఈతవనం పెంచుకునేందుకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ కల్పించాలని మాజీమంత్రి జీవన్ రెడ్డి కోరారు. ఆదివారం సారంగాపూర్ మండలం లచ్చక్కపేటలో ఎల్లమ్మతల్లి ప్రాణప్రతిష్ఠ, పట్నాల మహోత్సవంలో పాల్గొన్నారు. గౌడ వృత్తి ప్రమాదకరమైందని, ఈ వృత్తిపై ఆధారపడిన వారికి ప్రభుత్వం చేయూత అందించాలని కోరారు. బెల్ట్‌షాపులు మూసివేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌కు గ్రామానికి 10బెల్ట్ షాపులు నడుస్తున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కిరాణషాపుల్లో కూడా లిక్కర్ విక్రయిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గంగారెడ్డి, నరేష్ గౌడ్, మురళీగౌడ్ పాల్గొన్నారు.


