రాత్రి 8 అయ్యింది.
బస్ ఆగింది.
బన్నీ దిగాడు.
ఎదురుగా ఒక పెద్ద ఇల్లు.
మట్టి గోడలు. గూనపెంకుల ఇల్లు.
ముందు అరుగు.
అరుగు మీద తాతయ్య.
పక్కన నానమ్మ. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ... నవ్వుతున్నారు.
‘రా కన్నయ్య‘ అంది నానమ్మ.
బన్నీని దగ్గరకు తీసుకుంది.
తల నిమిరింది.
తాతయ్య చెయ్యి పట్టుకున్నాడు.
‘ఇది నీ ఇల్లు రా బన్నీ‘ అన్నాడు.
ఇంట్లో నుంచి పిల్లలు వచ్చారు.
చాలా మంది.
ముగ్గురు అత్తయ్యలు, మామయ్యలు. బాబాయ్, పిన్ని మరియు
ఆరుగురు పిల్లలు.
చుక్క, స్వప్న, రామ్ కూడా ఉన్నారు.
‘హాయ్ బన్నీ!‘ అన్నారు.
బన్నీ ఆశ్చర్యపోయాడు.
మేము కూడా వచ్చాము అన్నారు.
అందరూ నవ్వుకున్నారు.
నానమ్మ ఒక పళ్లెం తెచ్చింది.
పళ్లెంలో గారెలు.
బెల్లం గారెలు.
‘తినరా‘ అంది.
బన్నీ ఒక గారె తిన్నాడు.
తియ్యగా ఉంది. వేడిగా ఉంది.
అమ్మ చేసినట్టే ఉంది.
తాతయ్య అన్నాడు, ‘బన్నీ, ఇక్కడ అందరం ఒకే ఇంట్లో ఉంటాం.
అందరం కలిసి తింటాం. కలిసి నవ్వుతాం.
ఇది మన ఉమ్మడి కుటుంబం.‘
బన్నీ చుట్టూ చూశాడు.
అందరి మొహాల్లో నవ్వు.
బన్నీకి కూడా నవ్వు వచ్చింది.
భయం పోయింది.
పిల్లలకి మాట:
ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు.
ప్రేమతో ఉన్న మనుషులు.
డాక్టర్ కోట లక్ష్మణ్,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి,
మండలం: మంథని,
పెద్దపల్లి జిల్లా
గోంగూర పాప
హలో పిల్లలూ! గోంగూరతో పప్పు వండుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. కానీ.. అమ్మాయిని తయారు చేయవచ్చా? చేయవచ్చు! చూడండి. ఈ గోంగూరమ్మాయి బాగుందా? నేను మా కుండిలో గోంగూర చెట్టును పెట్టుకున్నాను. అందుకే ఈ గోంగూరను తేత ఆకుల్ని తీసుకున్నాను. దీని ని ’రెడ్ సోరెల్’ అని పిలుస్తారు. ఇది పుల్లగా ఉంటుంది. పోషకాలున్న ఆకుకూర. ఇందులో ఐరన్, విటమినే ’ఎ’ ఉంటుంది. యాంటి ఆక్సిడెంట్లు కూ డా ఉంటాయి. గోంగూరలో ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని రెండు రకాలుంటాయి. రక్తహీనతను నివారిస్తుంది. రోగ నిరోధక శక్తినే పెంపొందిస్తుంది.


