రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

మెట్‌పల్లిరూరల్‌: రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌, ఆత్మకూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం పరిశీలించారు. కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన అడిషనల్‌ కలెక్టర్‌ లతతో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రాల్లోకి ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా ఎందుకు కొనుగోళ్లు చేయడం లేదని, తేమ శాతం వచ్చినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులకు తిప్పలు తప్పడం లేదని విమర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచ్‌లు జగన్‌గౌడ్‌, రాజారాం, నాయకులు రాజేందర్‌, నర్సింహులు, అంజయ్య పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

కోరుట్ల రూరల్‌: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచేలా కేసీఆర్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement