పారదర్శకంగా సేవలు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా సేవలు

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

జగిత్యాలక్రైం: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అంది స్తున్నట్లు ఆ శాఖ అధికారి శ్రీనివాస్‌ తెలి పారు. ‘అక్కడ వారు చెప్పిందే ఫైనల్‌’ శీర్షికన ఈనెల 8న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించారు. కార్యాలయంలో అన్నిరకాల సేవలను పారదర్శకంగానే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్‌ సేవలు ఆన్‌లైన్‌లో దళారుల ప్రమేయం లేకుండా చూస్తున్నామని, కిందిస్థాయి ఉద్యోగుల పై నిఘా పెంచామన్నారు. ఏళ్ల తరబడి ఇక్కడే పనిచేస్తున్న వారి బదిలీకి ఉన్నతాధికారులకు లేఖ రాశామన్నారు. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement