జవాబులు:
01. నల్లని పాయ కలిగిన జీవనది?
02. శివుడు తలపై పెట్టుకున్న నది దేవత?
03. రాతి గుండ్లకు కమ్మలు పెట్టే నది ?
04. బంగారు వదనం కలిగిన నది?
05. పనికి ‘నాగా’ పెట్టే నది?
06. నంద అలిగి కూర్చుంది ఏ నదిలో?
07. ‘తుంగ’కు జాగ్రత్త చెప్పే నది?
08. వరి పంటను ‘గోదా’ లోకి దింపే నది?
09. నీరు కడుపులో పెట్టుకుని మూసేసే నది?
10. కళ్ళున్న నది ఏమిటి?
01. కృష్ణవేణి 02. గంగోత్రి
03. గుండ్లకమ్మ 04. స్వర్ణముఖి 05. నాగావళి 06. అలకనంద
07. తుంగభద్ర 08. గోదావరి, 09.మూసి, 10. నేత్రావతి.
– డాక్టర్ కందేపి రాణీప్రసాద్,
వైద్యురాలు, రచయిత్రి,
సిరిసిల్ల


