కోరుట్ల: మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు సేవలు మరవలేనివని వెలమ సంక్షేమ సమితి చైర్మన్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. రత్నాకర్‌రావు వర్ధంతి సందర్భంగా స్థానిక వెటర్నరీ కళాశాల సమీపంలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వెటర్నరీ, పాలిటెక్నిక్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అందుబాటులోకి తెచ్చారన్నారు. పట్టణంలో సుమారు 5వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి కొత్తకాలనీ ఏర్పాటు చేసిన ఘనత అయనదేనన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కృష్ణారావు, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్లు తిరుమల వసంత, మైలారపు లింబాద్రి, కాంగ్రెస్ నాయకులు తిరుమల గంగాధర్, వెంకటేశ్‌గౌడ్, జిందం లక్ష్మీనారాయణ, శంకర్, సంగ లింగం, తెడ్డు విజయ్, పుప్పాల ప్రభాకర్, ఎలిశెట్టి భూంరెడ్డి, కౌన్సిలర్లు సోగ్రాబీ, కస్తూరి లక్ష్మీనారాయణ, మోర్తాడ్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
మోదీ సభకు తరలిన బీజేపీ శ్రేణులు
మెట్‌పల్లి: హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఆ దివారం జరిగిన ప్రధాని మోదీ సభకు పట్టణం నుంచి బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సురభి నవీన్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వీరిలో కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.


