జగిత్యాలరూరల్/రాయికల్: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంతోపాటు రాయికల్‌లో మంగళవారం పర్యటించారు. జగిత్యాలలో 61 మందికి రూ.15.70లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్, 89 మంది రూ.89 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రాయికల్‌లో 40 మంది రూ.10.70లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్, 98మందికి రూ.98.9లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటానన్నారు. రాయికల్ మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, వైస్ చైర్మన్ తురగ సౌజన్య, ఆత్మ జిల్లా చైర్మన్ గంగారెడ్డి, తహసీల్దార్ నాగార్జున, కమిషనర్ మనోహర్‌గౌడ్, ఎంపీవో సుష్మ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్


