ఆ నాటి ఆటలే బాగుండే.. | - | Sakshi
Sakshi News home page

ఆ నాటి ఆటలే బాగుండే..

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

మా నాన్న చిన్ననాటి కాలంలో ఊరు మొత్తం పది టీవీలే ఉండేవి. వేసవి కాలం వచ్చిందంటే ఉదయాన్నే నిద్రలేవగానే వరికోసిన మడికట్లలో తొమ్మిదింటి వరకు క్రికెట్‌ ఆడేవారు. ఇంటికి వచ్చి అన్నం తిని చేనుల వద్దకు వెళ్లేవారు.. ఈత పళ్లు, తాటి ముంజలు, పులిచింతకాలు తెంపుకుని పంచుకునే వారు. దగ్గర్లో ఉన్న బావుల్లో ఈత కొట్టేవారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్లీ అన్నం

తిని చింతచెట్ల కింద ఆడుకునేవారు. ఎండ చల్లబడగానే.. మళ్లీ మడికట్లకు చేరుకునేవారు. సాయంత్రం సూర్యుడు వెళ్లిపోయే వరకు క్రికెట్‌ ఆడుకుని వచ్చేవారు. రాత్రికి మా నానమ్మ.. చేసిచ్చే చిరుతిండి తినుకుంటూ టీవీ చూసేవారమని మా నాన్న ఎప్పుడూ చెప్తుంటారు. కానీ.. ఇప్పుడు ఆ ఆటలు కనిపించడం లేదు. అలాంటి స్నేహితులు దొరకడం లేదు. నాన్న ఉద్యోగం, మా చదువుల కోసం సిటీకొచ్చి పడ్డాం.. ఇరుకు గదుల్లో ఉంటూ పంజరంలో పక్షిలా బతుకుతున్నాం. ఎండాకాలం అని మా మమ్మీ ఉదయం తొమ్మిదైనా నిద్ర లేవనివ్వడం లేదు. నిద్రలేచి స్నానం చేసిన తరువాత టిఫిన్‌ తిని టీవీ చూడడం, మళ్లీ చదువుకోవడం పొద్దంతా ఇంట్లో టీవీలో కార్టూన్లు చూడడం వరకే సరిపోతుంది. బయటికి వెళ్దామంటే అమ్మ ఎండ అంటుంది. గంటో అరగంటో ఆడితేనే అలిసిపోతున్నాం. ఎంతైనా మా నాన్న వాళ్ల చిన్నతనం నాటి రోజులే బాగుంటే.. ఆ ఆటలే మంచిగుండే.

– ఎ.అద్వైత్‌, రెండో తరగతి, హనుమాన్‌నగర్‌, కరీంనగర్‌

Advertisement
 
Advertisement
Advertisement