సెలవుల సమయంలో చదువుతోపాటు కొత్త వ్యాపకాల వైపు పిల్లలను మళ్లించాలి. వేసవి శిక్షణ శిబిరాల్లోనూ పెయింటింగ్, డ్రాయింగ్, డ్యాన్స్.. ఇలా పిల్ల ల అభిరుచికి అనుగుణమైన అంశాల్లో శిక్షణ ఇప్పించాలి. – లీనా ప్రియదర్శిని.
ప్రిన్సిపాల్ సెయింట్‌పాల్స్ హైస్కూల్
నాకు నటన అంటే చాలా ఇష్టం. పైగా అందరిలో మనకు ఒక గుర్తింపు ఉండాలంటే మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. సినిమా, టీవీ చానెళ్లలో నటించాలన్నదే నా కోరిక. అందుకే నటనలో శిక్షణ పొందుతున్నాను.
– ఎస్.మాన్విత, 6వ తరగతి


