ఆక్రమించిన నాలా స్థలాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఆక్రమించిన నాలా స్థలాల పరిశీలన

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

జగిత్యాలరూరల్‌: ప్రభుత్వ స్థలాలు, నాలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవని జగిత్యాలరూరల్‌ తహసీల్దార్‌ హకీం హెచ్చరించారు. ‘యథేచ్ఛగా వాగులు కబ్జా’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి గ్రామస్తులు, మత్స్సకారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు తిమ్మాపూర్‌ శివారులోని జగిత్యాల–గొల్లపల్లి ప్రధాన రహదారిలో సర్వేనంబరు 433, 434లోని ఒర్రె, నాలాను హకీం పరిశీలించారు. కొందరు మొ రం పోసి స్థలాన్ని ఆక్రమించినట్లు గుర్తించారు. నాలాకు హద్దులు నిర్ణయించి, జేసీబీ సహా యంతో అక్కడ పోసిన మొరాన్ని తొలగించా రు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా, కబ్జాకు యత్నించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్‌ఐలు భూ మయ్య, శంషుద్దీన్‌, జీపీవో నరేష్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement