‘మోడల్‌’లో ఇంటర్‌ ప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

‘మోడల్‌’లో ఇంటర్‌ ప్రవేశాలు

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

మల్లాపూర్‌: ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలకు ఈనెల 25వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్‌ వెలువడింది. జిల్లాలో కండ్లపల్లి(జగిత్యాల), గొల్లపల్లి, మగ్గిడి (ధర్మపురి), మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, కథలాపూర్‌, కల్లూర్‌ (కోరుట్ల), నూకపల్లి(మల్యాల), పెగడపల్లి, ఇటిక్యాల(రాయికల్‌), కుమ్మరిపల్లి (వెల్గటూర్‌), కొడిమ్యాల, మేడిపల్లిలో మొత్తం 13 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు అందిస్తున్నారు. ఒక్కో గ్రూపునకు 40మంది చొప్పున కళాశాలల్లో అవకాశం కల్పిస్తారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశానికి ఈనెల 25వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంసెట్‌, నీట్‌, సీఏ, సీపీటీ కోచింగ్‌ ఇస్తారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తారు. ఈ నెల 21న దరఖాస్తులు పరిశీలించి, ఎంపికై న వారి జాబితాను పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. ఈనెల 27 నుంచి 31 వరకు ఎంపికై న విద్యార్థుల విద్యార్హత ధ్రువపత్రాలను పరిశీలించి ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. బాలికలకు మాత్రమే హాస్టల్‌ సౌకర్యం ఉంది.

సీట్ల కేటాయింపు ఇలా

కేటగిరి శాతం సీట్లు జనరల్‌ బాలికలు

జనరల్‌ 50 20 13 7

ఎస్సీ 15 6 4 2

ఎస్టీ 6 2 1 1

బీసీ–ఎ 7 3 2 1

బీసీ–బీ 10 4 3 1

బీసీ–సీ 1 00 00 00

బీసీ–డీ 7 3 2 1

బీసీ–ఇ 4 2 2 00

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25 వరకు గడువు జిల్లాలో 13 మోడల్‌ స్కూళ్లు

ఒక్కో పాఠశాలలో 160 సీట్లు బాలికలకు హాస్టల్‌ వసతి

Advertisement
 
Advertisement
Advertisement