మొబైల్‌ ఫోన్లతో కాలక్షేపం | - | Sakshi
Sakshi News home page

మొబైల్‌ ఫోన్లతో కాలక్షేపం

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

జగిత్యాలటౌన్‌: క్షేత్రస్థాయిలో పరిష్కారం దొరకని సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి అధికారులకు ఆటవిడుపుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించాలని, సమయపాలన పాటించాలని కలెక్టర్‌ పలుమార్లు ఆదేశిస్తున్నా అధికారుల తీరు మారడం లేదు. సోమవారం నిర్వహించిన ప్రజవాణిలో కలెక్టర్‌ సత్యప్రసాద్‌ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించే పనిలో నిమగ్నం కాగా, అధికారులు మాత్రం తమ మొబైల్‌ మునిగి తేలడం కనిపించింది. కొందరు రీల్స్‌ చూస్తుండగా, మరికొందరు ఫోన్లు మాట్లాడుతూ కనిపించారు. ఇంకొందరు ఫోన్‌లో చాటింగ్‌ చేస్తూ కనబడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement