కాషాయమయమైన కొండగట్టు | - | Sakshi
Sakshi News home page

కాషాయమయమైన కొండగట్టు

May 12 2026 12:38 AM | Updated on May 12 2026 12:38 AM

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయం కాషాయమయమైంది. హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా కొనసాగాయి. ఉదయం 9 గంటలకు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్థాపిత దేవతారాధన నిర్వహించారు. హోమం, సుందరకాండ పారాయణం, పంచామృత అభిషేకం, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, అమ్మవారి కుంకుమార్చన, పుష్పాలతో సహస్రనామార్చన, హోమం, బలిహరణము, మహానివేదన నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు కపిందర్‌, ప్రధాన అర్చకులు రామకృష్ణ, వకుళాభరణం రఘు, జితేందర్‌ ప్రసాద్‌, వేదపండితులు పెద్దన్న శర్మ, రాజేశ్వర శర్మ, హరిబాబు శర్మ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement