రైతు సమస్యలపై పోరాడుతాం | - | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలపై పోరాడుతాం

May 7 2026 8:02 AM | Updated on May 7 2026 8:02 AM

● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

కోరుట్లరూరల్‌: రైతు సమస్యలపై పోరాడుతూనే ఉంటామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డును బుధవారం సదర్శించారు. నెలరోజులుగా మక్కలు కాంటా చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్‌ డీఎంకు ఫోన్‌ చేసి మక్కలు త్వరగా కొనుగోలు చేయాలని సూచించారు. మక్కలు రోజుల తరబడి ఇలాగే ఉంటే అకాలవర్షాలకు తడిసిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రైతులకు పంట పెట్టుబడి సాయం, యూరియా అందించడంలో విఫలమైన ప్రభుత్వం.. కనీసం రైతు కష్టపడి పండించిన ధాన్యాన్ని కూడా సకాలంలో కొనలేకపోవటం దారుణమన్నారు. ప్రభుత్వం మీడియా మేనేజ్‌మెంట్‌ వదిలి గ్రౌండ్‌లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం, మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలని, లేకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట రైతుబంధు సమితి జిల్లా మాజీ కన్వీనర్‌ చీటి వెంకట్రావు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే..

మల్లాపూర్‌: పంటల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని వేంపల్లిలో షార్ట్‌ సర్క్యూట్‌తో కాలిపోయిన మొక్కజొన్న పంటను బుధవారం పరిశీలించారు. బాధిత మహిళారైతు గుమ్ముల లతతో మాట్లాడారు. ఆధైర్యపడోద్దని, పరిహారం అందించేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్‌, సర్పంచ్‌ చిట్యాల లక్ష్మణ్‌, మాజీ ఎంపీటీసీ ఏనుగు రాంరెడ్డి ఉన్నారు.

మున్సిపల్‌ చైర్మన్‌, అధికారులపై ఫిర్యాదు

మెట్‌పల్లి: మున్సిపల్‌ చైర్మన్‌ మైలారపు లింబాద్రి, మొన్నటివరకు పనిచేసిన కమిషనర్‌ స్పందన, విద్యుత్‌ అధికారులపై 11వార్డు కాంగ్రెస్‌ ఇన్‌చార్జీ కొమిరెడ్డి లింగారెడ్డి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. వార్డులోని మంచినీటి బావి ప్రహరీ కొంతభాగాన్ని గోపనవేణి శేఖర్‌, బైన శ్రీనివాస్‌ పగులగొట్టి నీటిని వారి పంట పొలాలకు తరలిస్తున్నారని కొన్ని రోజుల క్రితం లింగారెడ్డి చైర్మన్‌, కమిషనర్‌, విద్యుత్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపి పైపులు, విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించామంటూ లింగారెడ్డికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అక్కడ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని, వారిపై చర్యలు తీసుకోవాలని లింగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement