జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలఅగ్రికల్చర్: సోలార్ విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాసలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. థర్మల్, జల విద్యుత్‌తో పోల్చితే సోలార్‌తో తక్కువ ఖర్చవుతుందన్నా రు. నియోజకవర్గంలోని 78వేల పేద, మధ్య తరగ తి కుటుంబాలకు ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందన్నారు. పర్యావరణానికి హాని చేయని సోలార్ విద్యుత్ వైపు ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మార్కెట్ చైర్మన్ నారాయణ రెడ్డి, డీఏవో భాస్కర్, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సుదర్శనం, డీఈ గంగారాం, ఏడీ తిరుపతినాయక్, ఎడీఈ జవహర్ నాయక్, ప్రోపెసర్ సుజాత, నాయకులు పాల్గొన్నారు.


