అమ్మ ప్రేమ | - | Sakshi
Sakshi News home page

అమ్మ ప్రేమ

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

నా రచన

అమ్మ మొదటి దైవమురా నేస్తమా

అమ్మ ప్రేమ వర్ణించలేము తమ్ముడా

భూదేవికి ఉన్నంత ఓర్పు రా

ఈ జగతిలో అమ్మ ప్రేమ వర్ణించలేమురా

మనను నవమాసాలు కనిపెంచేనుర

కంటికిరెప్పలా కపాడెనుర

మనకు మొదటి గురువు అమ్మే నేస్తమా

ఈ ప్రపంచంలో దొరకదు అమ్మ ప్రేమ

తన సుఖాన్నీ కోరుకోదు అమ్మ

తన పిల్లలను సుఖంగా చూసుకుంటోంది అమ్మ

ప్రయోజకున్ని చేయలనుకుంటుంది అమ్మ

తనకు ఆహారం లేకపోయినా నేస్తమా

మనకోసం తపన పడుతుంది నేస్తమా

కంటికి కనురెప్పలాగా అమ్మ

మనల్ని నిత్యము కాపాడుతుంది అమ్మ

అమ్మ లేకుంటే మనం లేము తమ్మ

ఈ జగతికి మూలాధారం అమ్మ

అమ్మ ప్రేమ వెల కట్టలేని ప్రేమ అమ్మను బాగా చూసుకో తమ్మా

చిన్నపుడు నిన్ను ఎత్తుకుంది అమ్మ

నీవు అనాఽథగా విడిచిపెట్టకు తమ్మ

నీవు అమ్మను విడిచిపెట్టకు తమ్ముడా

నక్క శ్రీకర్‌,

గ్రామం: ఊటూర్‌,

మండలం: మానకొండూర్‌

జిల్లా: కరీంనగర్‌

Advertisement
 
Advertisement
Advertisement