జగిత్యాల: జిల్లాలో రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసేందుకు సిరిసిల్లలోని అపరల్ పార్క్‌లో ఉన్న గోదాంలు కేటాయించాలని పౌర సరఫరాల శాఖ మంత్రిని సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు. జిల్లాలో గత ఖరీఫ్ సీజన్‌లో రైతుల వద్ద ప్రభుత్వం సేకరించిన ధాన్యం సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నులు రైస్‌మిల్లుల్లో నిలిచిపోయిందన్నారు. మళ్లీ సుమారు 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం లేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, గోదాంలు కేటాయించాలని కోరారు.


