మల్యాల: హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చో టుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ బి. సత్య ప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈనెల 10 నుంచి 12 వరకు కొండగట్టు శ్రీఆంజనేయస్వామి జయంతి ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం వివిధ శాఖల అధికారులు, పోలీసులతో సమీక్షించారు. భక్తులు పెద్ద ఎత్తు న తరలివచ్చే అవకాశం ఉందని, పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని సూచించారు. కోనేరు, ఆలయ పరి సరాల్లో పరిశుభ్రత, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, తాగునీటి వసతి కల్పించాలని పేర్కొన్నారు. మెట్లదా రిలో లైటింగ్, ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు, తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్ సదుపాయం, ట్రాఫిక్ నియంత్రణకు ప్ర త్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం నిర్వహణకు అదనపు సిబ్బందిని కేటాయించాలన్నారు. ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఎంపీడీఓ స్వాతి, తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
ధాన్యాన్ని త్వరగా మిల్లులకు చేర్చాలి
ధాన్యం తూకం వేసి త్వరిగతిన మిల్లులకు తరలించా లని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని తూకం వేయాలని, రైతులు ఇబ్బంది రానీయొద్దని సూచించారు.


