ఎప్‌సెట్‌లో మోరపల్లి విద్యార్థికి 308 ర్యాంక్‌ | - | Sakshi
Sakshi News home page

ఎప్‌సెట్‌లో మోరపల్లి విద్యార్థికి 308 ర్యాంక్‌

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

జగిత్యాలరూరల్‌: జగిత్యాల రూరల్‌ మండలం మోరపల్లి సర్పంచ్‌ కట్ట రాజేందర్‌, జమున దంపతుల కుమారుడు హితేష్‌ ఆదివారం వెలువడిన ఎప్‌సెట్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 308వ ర్యాంక్‌ సాధించాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదివిన హితేష్‌ ఇంటర్‌లో 995 మార్కులు సాధించాడు. జేఈఈ మెయిన్స్‌లో 99.77 శాతం పర్సంటైల్‌ సాధించాడు. హితేష్‌ను గ్రామస్తులు అభినందించారు.

డీసీఎంఎస్‌ అధికారి నిలదీత

ఇబ్రహీంపట్నం: మక్కల కొనుగోలులో జాప్యంపై డీసీఎంఎస్‌ అధికారి రాజేందర్‌ను రైతులు ఆదివారం నిలదీశారు. తేమశాతం వచ్చి నెల అవుతున్నా.. కాంటా వేయడం లేదని, సీరియల్‌ పాటించడం లేదని గొడవకు దిగారు. గన్నీ సంచులు లేకపోవడంతో తామే తెచ్చుకున్నామని, అయినా ఎందుకు తూకం వేయడం లేదని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement