ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

● టాపర్స్‌ను సన్మానించిన మంత్రి ● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత

జగిత్యాల: విద్యావ్యవస్థను పటిష్టం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆదివారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేతో కలిసి సన్మానించారు. రెండేళ్లుగా విద్యారంగంపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. టాయిలెట్స్‌, అదనపు తరగతి గదులు, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల కష్టఫలితంగానే జిల్లా టెన్త్‌ ఫలితాల్లో నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడు తూ జిల్లాకు మూడు తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌లు, ఇంటిగ్రెటెడ్‌ స్కూల్‌ ఏర్పాటు చేశామన్నారు. సారంగాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన రిత్వికకు రూ.10వేలు అందించా రు. డీఈవో రాము, నోడల్‌ అధికారి నారాయణ, డీఆర్డీవో రఘువరణ్‌, గ్రంథాలయ చైర్మన్‌ దినేష్‌, ఎంఈవో కిషర్‌, కేజీబీవీ పాఠశాల ప్రత్యేకాధికారి వీణ, పీడీ రవీందర్‌ ఉన్నారు.

మక్కల కేంద్రాలు పెంచండి

జగిత్యాలరూరల్‌: మక్కల కొనుగోలు కేంద్రాలు పెంచి దళారుల వ్యవస్థను నిర్మూలించాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. జగిత్యాలరూరల్‌ మండలం లక్ష్మీపూర్‌లో రైతు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగో లు కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. ప్రభుత్వం మక్కల కొనుగోలులో జాప్యం చేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అకాల వర్షాలు కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. కేసీఆర్‌ హయాంలో ఐదు వే ల ఎకరాలకు ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేసి ఏఈవో ను నియమించి రైతులు పండించిన పంటల వివరాలను నమోదు చేయించారని, తద్వారా పంటల కొనుగోలులో ఇబ్బంది రాలేదని తెలి పారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి, నాయకులకు ప్రణాళిక లేదన్నారు. సర్పంచ్‌ నల్ల కవిత, నాయకులు స్వామిరెడ్డి, లక్ష్మణ్‌, తిరుపతి, స్వామి, నరేశ్‌గౌడ్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

రైతుల గోడు పట్టదా..?

మల్లాపూర్‌: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు ఆదివారం రోడ్డెక్కారు. వీరికి భారతీయ కిసాన్‌సంఘ్‌ మద్దతు ప్రకటించింది. సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు కాసారపు భూమారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని, పంట అమ్ముకునేందుకు ఇబ్బంది పడడమేంటని ప్రశ్నించారు. తరుగు పేరిట నిర్వాహకులు, మిల్లర్లు దోచుకుంటున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని తెలిపారు. ఎస్సై అనిల్‌ ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. మాజీ ఎంపీటీసీ మొరపు గంగరాజం, సంఘ్‌ మండల అధ్యక్షు డు కళ్లెం మహిపాల్‌, పట్టణ అధ్యక్షుడు పోచంపల్లి రమేశ్‌రెడ్డి, కార్యదర్శి ఏనుగు ఆనంద్‌రెడ్డి, రైతులు బద్దం హరీష్‌రెడ్డి, మామిడి తుక్కారెడ్డి, సార లింగారెడ్డి, గోపిడి చిన్నారెడ్డి, కనుక మోహన్‌, రాజేందర్‌, నరేష్‌ పాల్గొన్నారు.

కొనుగోళ్ల జాప్యంపై ధర్నా

కథలాపూర్‌: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ మండలంలోని చింతకుంటలో రైతులు ఆదివారం ధర్నా చేశారు. కోరుట్ల– వేములవాడ రోడ్డుపై చింతకుంట క్రాస్‌ రోడ్డు వద్ద బైఠాయించారు. నెలరోజులు దాటినా తూకం వేయడంలేదని మండిపడ్డారు. ధాన్యం కొనడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి ఆందోళన చేస్తున్న రైతులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సర్పంచ్‌ నాగం భూమయ్య, రైతు నాయకులు జెల్ల వేణుగోపాల్‌, పోకతోట లింబాద్రి, సోమ దేవేందర్‌రెడ్డి, చెదలు శేఖర్‌, తిరుపతిరెడ్డి, భూమారెడ్డి, జలందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement